ట్రంప్‌ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

ట్రంప్‌ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

02-09-2017

ట్రంప్‌ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌ వస్తున్న సమయంలో పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుంచి హఠాత్తుగా వచ్చిన ఓ కారు ట్రంప్‌ కాన్వాయ్‌ను ఢీకొనబోయి, రోడ్డుపై ఆగిపోయింది. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అమెరికాలోని మిస్సోరి పర్యటనకు వెళ్లిన ట్రంప్‌ విమానాశ్రయం నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, కారు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, ఘటన జరిగిన సమయంలో వీడియో తీసిన ఓ ప్రత్యక సాక్షి మాత్రం విభిన్నమైన కథనాన్ని వినిపిస్తున్నాడు. కావాలనే ఆ కారు ట్రంప్‌ కాన్వాయ్‌ వైపు దూసుకువచ్చిందని ఆయన తెలిపాడు.ఆ కారులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టుగా కనిపించిందని చెప్పాడు.