జూకు 140 కోట్లు విరాళం ఇచ్చిన వృద్ధురాలు

జూకు 140 కోట్లు విరాళం ఇచ్చిన వృద్ధురాలు

02-09-2017

జూకు 140 కోట్లు విరాళం ఇచ్చిన వృద్ధురాలు

అమెరికాకు చెందిన 93 ఏళ్ల వృద్ధురాలు జర్మనీలో ఉన్న ఓ జూకు భారీ విరాళాన్ని ప్రకటించింది. కొలిన్‌లో ఉన్న జూకు ఆమె సుమారు 140 కోట్లు విరాళంగా ప్రకటించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ జూ ఉన్న ప్రాంతంలోనే తన భర్తను కలుసుకున్నట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఎలిజబెత్‌ రీచర్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. నాజీల నుంచి ప్రాణ హాని ఉన్న అర్నల్ఫ్‌ రీచర్ట్‌ ఆమెకు 1944లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డవాళ్లు మిలియన్ల డాలర్లు సంపాదించారు. అయితే వీరికి సంతానం లేదు. మరణానంతరం తమ సంపదను జూకు డొనేట్‌ చేయాలని ముందుగానే భావించారు. దాని ప్రకారమే ఎలిజబెత్‌ రీచర్ట్‌ తన ఆస్తిని జూకు రాసి ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఆ వృద్దిరాలి భర్త పేరుమీదున్న ఫౌండేషన్‌ ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయనున్నారు.