ప్రీమౌంట్ బావర్చి ఇండియన్ రెస్టారెంట్ లో ఎన్నారై టీడీపీ సంబరాలు

ప్రీమౌంట్ బావర్చి ఇండియన్ రెస్టారెంట్ లో ఎన్నారై టీడీపీ సంబరాలు

03-09-2017

ప్రీమౌంట్ బావర్చి ఇండియన్ రెస్టారెంట్ లో ఎన్నారై టీడీపీ సంబరాలు

నంద్యాల ఉప ఎన్నికల్లో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి గుర్తుగా బే ఏరియాలో ఉన్న ఎన్నారై టీడీపీ శాఖ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని ప్రీమౌంట్ బావర్చి ఇండియన్ రెస్టారెంట్ లో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు నోరును తీపి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నేతలు శ్రీకాంత్ దొడ్డపనేని, లక్ష్మణ్ పరుచూరు, భక్త, బల్లా, చందు మల్లెల, వర్నిక మల్లెల, సాయి కంభంపాటి, వెంకట్ కొరసపాటి, ప్రణీత్ పరుచూరి, కుమార్ రాజ సెల్వం (తమిళనాడు టీడీపీ) తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఇక ముందు ఇలానే విజయం సాధించాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. వచ్చేనెలలో అమెరికాలో అడుగు పెడుతున్న సి.ఎం చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు వారు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.