తెలుగువాళ్లంతా క్షేమమే
MarinaSkies
Kizen

తెలుగువాళ్లంతా క్షేమమే

11-09-2017

తెలుగువాళ్లంతా క్షేమమే

ఇర్మా హరికేన్‌ విధ్వంసానికి గురవుతున్న ఫ్లోరిడాలో మన తెలుగువాళ్లంతా క్షేమంగానే ఉన్నారు. హరికేన్‌ తీరాన్ని తాకిన  ప్రాంతంలో మనవాళ్లు తక్కువగా ఉన్నారని, ఎక్కువ మంది టాంపా, ఆర్లాండో, జాక్సన్‌విల్లేల్లో ఉంటారని ఏపీఎన్నార్టీ మీడియా సమన్వయకర్త సాగర్‌, ఫ్లోరిడా సమన్వయకర్త పాపారావు తెలిపారు. తెలుగువాళ్లంతా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని చెప్పారు. హరికేన్‌ టాంపాకు చేరే సమయానికి తీవ్రత తగ్గుతుంది కాబట్టి సమస్య ఉండదన్నారు.