అమెరికా పర్యటనకు రాహుల్‌

అమెరికా పర్యటనకు రాహుల్‌

11-09-2017

అమెరికా పర్యటనకు రాహుల్‌

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమెరికా బయలుదేరారు. రెండు వారాల పాటు ఆ దేశంలో జరపనున్న పర్యటనలో ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రపంచ స్థాయి మేధావులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 70 ఏళ్ల భారత్‌ అనే అంశంపై ప్రసంగించనున్నారు. 1949లో ఆయన ముత్తాత, భారత్‌ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అక్కడే ప్రసంగించడం విశేషం. సిలికాన్‌ వ్యాలీ, ప్రిన్సెటన్‌ విశ్వవిద్యాలయాల్లో కూడా రాహుల్‌ ప్రసంగిస్తారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యాం పిట్రోడా అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.