పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్

పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్

11-09-2017

పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్

భారత, అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌)- 2017కు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. నవంబరు 28 నుంచి 30 వరకు జరిగే ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనయ ఇవాంకా ట్రంప్‌ కూడా పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘‘భారత్‌లో జరగబోయే జీఈఎస్ 2017కు అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించడం, ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా..’’ అని ట్వీట్ చేశారు.