టెక్సాస్‌లో కాల్పుల కలకం

టెక్సాస్‌లో కాల్పుల కలకం

11-09-2017

టెక్సాస్‌లో కాల్పుల కలకం

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌ నగరం ఉత్తర డల్లాస్‌లో ఆదివారం రాత్రి ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళితే... డల్లాస్‌లో కౌబాయ్స్‌ పుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పార్టీ జరుపుకున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు ఇంట్లోకి చొరవడి అక్కడ ఉన్న యువతితో గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్తా ముదరడంతో తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే హతమార్చారు. ఈ కాల్పులో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు.