న్యూయార్క్ లో టిఎల్ సిఎ వనభోజనాలు...పాల్గొన్న ప్రముఖులు
APEDB

న్యూయార్క్ లో టిఎల్ సిఎ వనభోజనాలు...పాల్గొన్న ప్రముఖులు

11-09-2017

న్యూయార్క్ లో టిఎల్ సిఎ వనభోజనాలు...పాల్గొన్న ప్రముఖులు

న్యూయార్క్‌లో తెలుగు లిటరరీ కల్చరల్‌ అసోసియేషన్‌ (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో ఆదివారంనాడు వార్షిక పిక్నిక్‌లో భాగంగా వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జాతీయ తెలుగు సంఘాలు తానా, నాటా, టాటా సహకరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలకు సహకరించిన తానాకు టిఎల్‌సిఎ కార్యవర్గ బృందం ధన్యవాదాలు తెలియజేసింది. 

వనభోజనాల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీల్లో చిన్నారులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహూమతులను కూడా ప్రదానం చేశారు. వచ్చినవారికి షడ్రసోపేతమైన విందును వడ్డించారు.

తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరితోపాటు టాటా నాయకుడు పైళ్ళ మల్లారెడ్డి, పోలవరపు రాఘవరావు, డా. పూర్ణ అట్లూరి, మాధవరెడ్డి, వెంకటేష్‌ ముత్యాల, నాగేంద్ర గుప్తా, బాబు కుదరవల్లి, శ్రీనివాస్‌ గూడురుతోపాటు టిఎల్‌సిఎ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సత్య చల్లపల్లి, రావు ఓలేటి, శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమంత్‌, అశోక్‌, జెపి, కృష్ణశ్రీ గంధం కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.


Click here for Event Gallery