అమెరికాలో రాహుల్‌కు ఘన స్వాగతం
MarinaSkies
Kizen

అమెరికాలో రాహుల్‌కు ఘన స్వాగతం

12-09-2017

అమెరికాలో రాహుల్‌కు ఘన స్వాగతం

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన రెండు వారాల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికాకు చేరుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఆయనకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా, ఇండియన్‌ నేషనల్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌ఓసీ) అధ్యక్షుడు సుధాసింగ్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాహుల్‌ గాంధీ పలు విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే ప్రసంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచ మేధావులు, రాజకీయవేత్తలు, భారత అమెరిన్లతో భేటీ అవుతారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతావని అంశంపై ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తిచూపిన వారి సంఖ్య ప్రాంగణం స్థాయిని మించిపోవటంతో పేర్ల నమోదును నిలిపివేసినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. 1949లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇదే విశ్వవిద్యాలయంలో ప్రసంగించారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మధుగౌడ్‌ యాస్కీ తెలిపారు. లాస్‌ఏంజెలెస్‌, న్యూయార్క్‌ తదితర నగరాల్లో నిర్వహించే కార్యక్రమాల్లోనూ రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు.