సునయనను అమెరికా నుంచి పంపే యత్నం
MarinaSkies
Kizen

సునయనను అమెరికా నుంచి పంపే యత్నం

12-09-2017

సునయనను అమెరికా నుంచి పంపే యత్నం

అమెరికాలో జాతి విద్వేష కాల్పుల్లో హతమైన శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన వెనక్కి పంపించే ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోవడంతో పలువురు ముందుకొచ్చి తోడ్పడ్డారు. శ్రీనివాస్‌ కాల్పుల్లో హతమవడంతో సునయన అమెరికాలో నివాస హోదాను కోల్పోయి దేశం నుంచి తిప్పి పంపే ముప్పు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్‌ రిపబ్లికన్‌ సభ్యుడు కెవిన్‌ యోడెర్‌, తదితరులు తాత్కాలికంగా ఏడాది వీసా పొందడంలో సహాయం అందించారు. దీంతో సునయనకు ఓవర్లాండ్‌ పార్క్‌ లోని మార్కెటింగ్‌ ఏజన్సీలో పని చేసుకునేందుకు ఏడాది వీసా మంజూరైంది. తాము ఆమెను తిప్పిపంపబోమని యోడెర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీసాను శాశ్వతంగా మార్చేందుకు కృషిచేస్తున్నట్లు యోడెర్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ఓ ఈమెయిల్‌లో సునయన స్పందిస్తూ... దురదృష్టకరమైన ఫిబ్రవరి 22న తాను తన భర్తను మాత్రమే కాకుండా, తన వలస హోదాను కోల్పోయాననీ, ఆ హోదాను తాత్కాలికంగానైనా పునరుద్ధరించేందుకు చాలామంది ముందుకొచ్చి సహాయం అందించారనీ, దానిని శాశ్వతంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.