లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 2028 ఒలింపిక్స్‌
APEDB

లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 2028 ఒలింపిక్స్‌

12-09-2017

లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 2028 ఒలింపిక్స్‌

లాస్‌ ఏంజిల్స్‌లో 2028 ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తాజాగా సంకేతాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఒలింపిక్‌ కమిటీ త్వరలో వెల్లడించనున్నది. 2024లో ఒలింపిక్స్‌ క్రీడలు పారిస్‌లో జరగనున్నాయి. వాస్తవానికి 2024లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు లాస్‌ ఏంజిల్స్‌ పోటీపడింది. కానీ ఆ బిడ్‌ను పారిస్‌ దక్కించుకున్నది. దీంతో 2028 క్రీడలను లాస్‌ ఏంజిల్స్‌కు కేటాయించారు. అయితే ఒలింపిక్‌ కమిటీ నుంచి అదనపు నిధులు లాస్‌ ఏంజిల్స్‌ పొందనున్నది. మెగా క్రీడల నిర్వహణ కోసం సుమారు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని ఒలింపిక్‌ కమిటీ లాస్‌ ఏంజిల్స్‌కు అందించనున్నది.