మరికొన్ని గంటల్లో ఐ ఫోన్ 8 విడుదల
MarinaSkies
Kizen

మరికొన్ని గంటల్లో ఐ ఫోన్ 8 విడుదల

12-09-2017

మరికొన్ని గంటల్లో ఐ ఫోన్ 8 విడుదల

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ ఎక్స్.. మరికొద్ది గంటల్లో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 12 అర్ధరాత్రి ఫోన్ ను ఆవిష్కరించనున్నారు యాపిల్ సీఈవో టిమ్ కుక్. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో ఇందుకు సంబంధించి ఏర్పాటు పూర్తయ్యాయి. దీని ధర వెయ్యి డాలర్లు (రూ. 64వేలు) పైనే ఉంటుందని అంచనా. ఐఫోన్ 8తోపాటు ఐఫోన్ 8plus కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.

దీనిలో ఉండే ఫ్యూచర్స్ ఏంటో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా.. నిపుణుల అంచనా ప్రకారం 3D ట్రాకింగ్ టెక్నాలజీ, ఎడ్జ్ టు ఎడ్జ్  డిస్ ప్లే స్క్రీన్, నో హోమ్ బటన్, ఫేస్ ఐడీ, టచ్ బార్, ఐఓఎస్ 11, వైర్ లెస్ ఛార్జింగ్ ఉండే అవకాశముందంటున్నారు.

వీటితో పాటు ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ లో 3GB ర్యామ్, ఐఫోన్ 8లో 2జీబీ ర్యామ్ ఉంటుందంటున్నారు.  ఐఫోన్ ఎక్స్ లో ఫ్రంట్ కెమేరా 7మెగా ఫిక్సల్స్ ఉంటే, బ్యాక్ కెమేరాలో 12 మెగాఫిక్సల్ అంటున్నారు. స్క్రీన్ 5.8 ఇంచులు ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఐఫోన్ అభిమానులు ఇప్పటికే షాపుల ముందు బారులు తీరారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కొత్త వెర్షన్ 8 కోసం వెయిట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద లైన్ లలో షోరూమ్ ముందు వరస కట్టారు. ఎప్పుడెప్పుడు  ఫోన్ కొందామా అని ఆత్రుత అందరిలోనూ నెలకొంది. 2016లో ఐఫోన్ 7 విడుదల చేసినప్పుడు కూడా ఇలాగే జనం బారులు తీరారు.