కాలిఫోర్నియా వర్శిటీలో రాహుల్‌ గాంధీ
MarinaSkies
Kizen

కాలిఫోర్నియా వర్శిటీలో రాహుల్‌ గాంధీ

12-09-2017

కాలిఫోర్నియా వర్శిటీలో రాహుల్‌ గాంధీ

నేను మాత్రమే వారసత్వ రాజకీయాల్లో వచ్చాను అనుకోవద్దు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇదే పద్ధతి ఉంది. భారత్‌లో చాలావరకు ఇదే సంస్కృతి కొనసాగుతోంది. అఖిలేశ్‌ యాదవ్‌, స్టాలిన్‌ ఇలా వచ్చిన వారే. అంతెందుకు బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, పారిశ్రామికవేత్త అంబానీ సోదరులు కూడా వారసత్వం ద్వారా వెలుగులోకి వచ్చిన వారే ‘ అని రా#హుల్‌ తెలిపారు. రెండు వారాల పర్యటనలో భాగంగా ఆయన బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగించారు. అక్కడి విద్యార్థులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఇండియా ఎట్‌ 70: రిప్లెnక్షన్స్‌ ఆన్‌ ది పాత్‌ ఫార్వర్డ్‌’ అనే అంశంపై మాట్లాడారు.గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయానికి అహంకారమే కారణమని అంగీకరించారు. దాదాపు దశాబ్దకాలం పాటు అధికారంలో కాంగ్రెస్‌ ఉంది. అందువల్ల నేతల్లో కొంత అహంకారం, అలసత్వం చోటుచేసుకుంది. దానికితోడు ప్రజలతో మమేకం కావడంలోనూ విఫలం అయ్యాం. అని రాహుల్‌ చెప్పుకొచ్చారు.

ప్రధాని మోడీ పాలనపైనా, బీజేపీ పార్టీపైనా తీవ్ర విమర్శలు చేశారు. విభజన రాజకీయాలు ప్రజలను వేరుచేస్తున్నాయని, పెట్రేగుతున్న హింస పౌరుల స్వేచ్ఛను హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రధానిగా పోటీ చేస్తారా’? అని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ ‘అవునని’ సమాధానమిచ్చారు. అదేసమయంలో పార్టీ పగ్గాలనూ చేపడతారా? అన్న ప్రశ్నకూ అవుననే జవాబిచ్చారు. బహుశా అక్టోబర్‌లో తన తల్లినుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ‘నేను ప్రధాని పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మాది సంస్థాగత పార్టీ. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం దీనిపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి’ అని రాహుల్‌ వివరించారు. విభజన రాజకీయాలతో మోడీ దేశాన్ని చీలుస్తున్నారని రా#హుల్‌ అన్నారు.