10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు : మూడవ ప్రకటన
MarinaSkies
Kizen

10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు : మూడవ ప్రకటన

13-09-2017

10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు : మూడవ ప్రకటన

రెండు వారాలలో ....అనగా సెప్టెంబర్ 23 -24, 2017 తారీకులలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC ప్రాంతంలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కి మిమ్మల్ని సకుటుంబ, సపరివార సమేతంగా మరొక సారి సారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమైన ఏర్పాట్లూ అన్నీ పూర్తి అయ్యాయి. పై నగరాల నుంచి వచ్చే వారికి అతి తక్కువ ఖరీదులో వసతి ఏర్పాటు చేశాం. స్థానిక DULLES airport నుంచి హోటల్ కి, అక్కడ నుంచి సభాస్థలికి ఉచితంగా shuttle సర్వీసు ఉంటుంది. హోటల్ గది ఈ తక్కువ ఖరీదులో బుక్ చేసుకోడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 15, 2017. ఇప్పటి వరకూ 25 గదులు రిజర్వ్ అయిపోయాయి. 

సదస్సు ప్రవేశ రుసుము ఒక్కొక్క వ్యక్తికీ కేవలం $50 మాత్రమే. ప్రతినిధులు అందరికీ రెండు రోజులు ఉదయం &  మధ్యాహ్నం కాఫీ, ఫలహారాలు, మధ్యాహ్నం విందు భోజనం, ఈ సదస్సు సందర్భంగా ముద్రించబడి సదస్సులో విడుదల అయ్యే కనీసం మూడు పుస్తకాలు (అమెరికా తెలుగు కథానిక -13వ సంకలనం తో సహా, సుధేష్ణ సోమ గారి నవల 'నర్తకి' తో సహా..)...రెండు రోజుల పాటు హాయిగా, సరదాగా వినోద భరితంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తి కరంగా ఉన్నత స్థాయి సాహిత్యం విందు....అన్నీ అంత తక్కువ ఖర్చులోనే... వెలకట్ట లేని జీవితానుభవం....

అంతే కాదు..భారత దేశం నుంచీ. అమెరికాలో ఇతర నగరాల నుంచీ వస్తున్న ఆహ్వానిత ప్రముఖుల వివరాలు, జీవన సాఫల్య పురస్కార గ్రహీతల వివరాలు, కొన్ని ప్రసంగాంశాలు, ఆవిష్కరించబడుతున్న పుస్తకాల వివరాలు వగైరాలతో ఉన్న మూడవ ప్రకటన ఇందుతో జతపరిచాం. అలాగే మీకున్న Whatsapp గుంపు లో ఉన్నవారందరికీ పంపించడానికి వీలుగా మరొక చిన్న ఆహ్వానం కూడా జతపరిచాం. దయ ఉంచి సమగ్ర ప్రకటన ఇమెయిల్ ద్వారా కానీ, ఆత్మీయ ఆహ్వానం whatsapp లో కానీ మీ మిత్రులందరికే పంపించి సహాయపడమని అర్థిస్తున్నాం.  

ప్రతిష్టాత్మకమైన ఈ 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం తమ విరాళాలతో ఆర్థిక పరంగా సమర్ధించమని తెలుగు భాషా సాహిత్యాభిమానులందరినీ కోరుతున్నాం. ఇందుతో జత పరిచిన "Registration & Donation" పత్రంలో ప్రతినిధులుగా నమోదు చేసుకోడానికీ, తగిన విరాళం పంపించడానికీ కావలసిన వివరాలు ఉంటాయి. లేదా దయచేసి ఈ క్రింది లంకె మీద నొక్కి ఏ క్రెడిట్ కార్డ్ అయినా వాడి మీ విరాళం పంపించి సహాయం చెయ్యండి. Registration Fees & Donation are tax-deductible in USA.


https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=3R29K3F2QREMQ

వాషింగ్టన్ DC ప్రాంతంలో మొట్టమొదటి సారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకి మీకు మరొక్క సారి సాదరంగా ఆహ్వానం పలుకుతూ....


వంగూరి చిట్టెన్ రాజు & భాస్కర్ బొమ్మారెడ్డి  

స​దస్సు నిర్వాహక సంస్థలు: 

​వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ​& రాజధాని ప్రాంత తెలుగు సంఘము 

సదస్సు కార్యనిర్వహాక వర్గ సభ్యులు: 

Sai Rachakonda (Houston), Nallu Chittarajan, Badrinath Challa, Ravi Bojja, Satyajit Mareddy,

Sudarshana Devireddy, Gopal Nunna, Srinivas Vootla, Anil Nandikonda, Vijaya Dondeti, Rajya Lakshmi, Durgaprasad Gangisetti, Satish Vaddi, Ramachandra Yerubandi

మరియు​

గౌరవ సలహా దారులు: సుధేష్ణ సోమ, జక్కంపూడి సుబ్బారాయుడు, వంశీ రామరాజు (హైదరాబాద్)

Conact: Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com ​


మరొక చిన్న విన్నపం:

10వ సదస్సు అమెరికాలో జరుగుతున్నాఇండియాలో కొన్ని అవసరమైన ఖర్చులు అవుతున్నాయి. అంచేత ఆసక్తి ఉన్న వారు మీ విరాళం రూపాయల రూపేణా ఇండియాలో పంపించవచ్చును. Our account details are:

Account name: Vanguri Foundation of America
A/c Number: 013210011015533
Bank Name: Andhra Bank, Bagh Amberpet Branch, Hyderabad, TN
IFSC code: ANDB0000132