శభాష్‌ సతీష్‌ వేమన...
MarinaSkies
Kizen

శభాష్‌ సతీష్‌ వేమన...

13-09-2017

శభాష్‌ సతీష్‌ వేమన...

అమెరికా తెలుగు కమ్యూనిటీకి ఆపద వచ్చినప్పుడు స్వయంగా రంగంలో దిగే నాయకుడు చాలా అరుదుగా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి స్వయంగా వెళ్ళి అందరితోపాటు తాను కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొంతమంది వల్లనే అవుతుంది. ఇలాంటి వ్యక్తుల్లో ఇప్పుడు సతీష్‌ వేమన అగ్రభాగాన నిలుస్తున్నారు. హార్వే బీభత్సంతో తల్లడిల్లిన హ్యూస్టన్‌ ప్రాంతంలో ఉన్న తెలుగు కమ్యూనిటీకి ఆపన్న హస్తాన్ని సతీష్‌ వేమన స్వయంగా అందించారు.

తానా నాయకులను వెంటపెట్టుకుని బాధిత ప్రాంతానికి హుటాహుటిన తరలివెళ్ళారు. హ్యూస్టన్‌ ప్రాంతంలో తుపాన్‌ బాధితులకు సాయం చేయడంతోపాటు వేలాదిమందికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను సమకూర్చడంతోపాటు, ధ్వంసమైన ఇళ్ళల్లో షీట్‌రాక్‌ మార్చడం, ఫర్నిచర్‌, డెబ్రి క్లీన్‌ చేయడం వంటివి తానా నాయకులతోపాటు సతీష్‌ వేమన చేశారు. హ్యూస్టన్‌ చిల్డ్రన్‌ ఛారిటీకి చెందిన పిల్లలకు ఆహారపొట్లాలను కేటీ ఫుడ్‌బ్యాంక్‌లో మంచినీరు ఫుడ్‌ అందించారు. ఈ కార్యక్రమంలో సతీష్‌ వేమన చూపిన చొరవను, కృషిని అందరూ ప్రశంసించారు.

సతీష్‌ వేమనతోపాటు అంజయ్యచౌదరి లావు, చలపతి కొండ్రకుంట, పద్మశ్రీ ముత్యాల, డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రసాద్‌ నల్లూరి, ప్రసాద్‌ గుమ్మడి, పూర్ణ సుధాకర్‌ వేములపల్లి, సుధీర్‌ కోనేరు, కిరణ్‌ మానుకొండ తదితరులు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.