మిచిగన్‌ లో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం
MarinaSkies
Kizen

మిచిగన్‌ లో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం

13-09-2017

మిచిగన్‌ లో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం

మిచిగన్‌ తానా ఛాప్టర్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ పిల్లలకు బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 12వ తేదీన నిర్వహించారు. మార్క్‌ ట్విన్‌ ఎలిమెంటరీ స్కూల్‌ పిల్లలకు బ్యాగ్‌లను పంపిణీ చేశారు. జయరామ్‌ అట్లూరి స్మారకార్థం ఆయనకుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌, తానా కలిసి ఈ స్కూల్‌ బ్యాగ్‌ల పంపిణీని చేశారు. తానా రీజినల్‌ డైరెక్టర్‌ సునీల్‌ పాంత్రా బ్యాగ్‌లను చిన్నారులకు అందజేశారు. దాదాపు 500 మందికి బ్యాగ్‌లను ఇచ్చారు. సురేష్‌ పుట్రగుంట, వంశీ ఇనపురి బ్యాగ్‌లను విరాళంగా ఇచ్చారు. జో పెద్దిబోయిన ఈ కార్యక్రమం విజయవంతమవడానికి కృషి చేశారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.