రాజ్ షాకు కీలకమైన బాధ్యత
MarinaSkies
Kizen

రాజ్ షాకు కీలకమైన బాధ్యత

13-09-2017

రాజ్ షాకు కీలకమైన బాధ్యత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలన వర్గంలో ఓ భారతీయ సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కాయి. రాజ్‌ షా అనే భారత సంతతి పౌరుడికి తన సమాచార సంబంధ వ్యవహారాల విభాగంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శ్వేతసౌదం ఒక ప్రకటన చేసింది. అలాగే, తన విశ్వసనీయుడైన హోప్‌ హిక్స్‌ను కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా నియమించారు. అంతకు ముందు ఆయన ఇదే అంతర్గత కమ్యునికేషన్‌ విభాగంలో ట్రంప్‌కు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. అధ్యక్షుడికి రాజ్‌ షా కమ్యూనికేషన్‌ విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపాల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు అని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. కనెక్టికట్‌లో జన్మించిన రాజ్‌ షా కుటుంబానిది గుజరాత్‌. వారు 1980లోనే అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.