కాలిఫోర్నియాలో రాహుల్‌ పర్యటన
Telangana Tourism
Vasavi Group
Manjeera Monarch

కాలిఫోర్నియాలో రాహుల్‌ పర్యటన

13-09-2017

కాలిఫోర్నియాలో రాహుల్‌ పర్యటన

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిలికాన్‌ వ్యాలీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీ సిలికాన్‌ వ్యాలీలోని సోలార్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను సందర్శించారు. రాహుల్‌గాంధీ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. సౌరశక్తి వినియోగం వల్ల కలిగే లాభాలు, దుష్ఫ్రభావాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సోలార్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను సందర్శించడం, భారత్‌లో సోలార్‌ విద్యుత్‌ను మరింత విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని రాహుల్‌తో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా అన్నారు. అంతకుముందు రాహుల్‌గాంధీ కాలిఫోర్నియాలోని టెస్లా పరిశ్రమను పరిశీలించారు.