అక్టోబర్‌ 1న ఎఫ్‌ఐఎ దివాళీ మేలా
Ramakrishna

అక్టోబర్‌ 1న ఎఫ్‌ఐఎ దివాళీ మేలా

14-09-2017

అక్టోబర్‌ 1న ఎఫ్‌ఐఎ దివాళీ మేలా

గ్రేటర్‌ చికాగోలో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఎ) ఆధ్వర్యంలో గ్రేటర్‌ చికాగోలో గ్రాండ్‌ దీవాళీ మేలాను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 1వ తేదీన షుంబర్గ్‌లోని రినేసాన్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చంద్రశేఖర్‌ రెడ్డి పాల్వాయి తెలిపారు. ఈ సందర్భంగా రిచాశర్మ నాన్‌స్టాఫ్‌ పాటల కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన వివరించారు. స్థానిక చిన్నారులు, పెద్దలతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ వ్యాపార, వాణిజ్య కంపెనీలు ఈ కార్యక్రమంలో బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాయని చంద్రశేఖర్‌ రెడ్డి పాల్వాయి చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాల్సిందిగా ఆయన కోరారు.