తానా రీజినల్‌ కాన్ఫరెన్స్‌కు భారీ ఏర్పాట్లు
MarinaSkies
Kizen

తానా రీజినల్‌ కాన్ఫరెన్స్‌కు భారీ ఏర్పాట్లు

14-09-2017

తానా రీజినల్‌ కాన్ఫరెన్స్‌కు భారీ ఏర్పాట్లు

ఫిలడెల్ఫియాలో అక్టోబర్‌ 14వ తేదీన నిర్వహిస్తున్న తానా రీజినల్‌ కాన్ఫరెన్స్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లాన్స్‌డాలేలో ఉన్న నార్త్‌ పెన్‌ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రీజినల్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా అనేక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, బిజినెస్‌ సెమినార్‌లు, సాహిత్య సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 100 మందికిపైగా చిన్నారులతో స్వాగత గీతాన్ని కూడా ప్రదర్శించనున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించారు. మరోవైపు ఈ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా అలరించేందుకు చిత్ర బృందం సినీనటీ నటులు కృషి చేయనున్నారు.

ప్రముఖ గాయని చిత్ర ఆధ్వర్యంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. గాయనీ గాయకులు హేమచంద్ర, శ్రీకృష్ణ, గీతా మాధురి, సమీర భరద్వాజ్‌, ప్రృధ్వీ పాటలు పాడనున్నారు. సినీనటీనటులు భానుప్రియ, కమలినీ ముఖర్జీ, నారా రోహిత్‌, నందు తదితరులు ఈ కాన్ఫరెన్స్‌లో అలరించనున్నారు.