ఈ నెల 23న అమెరికాలో బతుకమ్మ వేడుకలు

ఈ నెల 23న అమెరికాలో బతుకమ్మ వేడుకలు

15-09-2017

ఈ నెల 23న అమెరికాలో బతుకమ్మ వేడుకలు

ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ ప్రస్తుతం దేశవిదేశాలకు వెళ్లింది. పలు దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తాము నివసిస్తున్న చోట బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పండుగలను జరుపుకుంటూ  వాటిని కాపాడుకుంటున్నారు. అయితే తాజాగా అమెరికాలోని శాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్‌ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ వేడుకలను ఈ నెల 23న కాలిఫోర్నియా  స్టేట్‌ శాక్రమెంటో నగరంలోని నాలిగేటర్‌ ఎలిమెంటరీ స్కూల్‌ నిర్వహించనున్నది.