తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ
Ramakrishna

తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ

19-09-2017

తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం న్యూఇంగ్లాండ్‌ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీన బ్రిస్టల్‌ స్వీడిష్‌ సోషల్‌ క్లబ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తానా రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విశ్వనాథ్‌ నాయునిపాటి తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటలపోటీలను, కోలాటంతోపాటు అందంగా అలంకరించిన బతుకమ్మకు కూడా ప్రైజ్‌ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా తానా ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.