భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట
Ramakrishna

భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట

19-09-2017

భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట

భారతీయ ఐటి నిపుణులకు భారీ ఊరట లభించింది. ప్రీమియం హెచ్‌ 1 బీ వీసాల జారీపై  (ప్రత్యేక ఫీజుతో  ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్) అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం హెచ్‌ 1బీ వీసాల జారీని పునరుద్ధరించేందుకు ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అన్ని కేటగిరీలలోనూ హెచ్-1 బీ వీసాల స్వీకరణ ప్రక్రియ (ప్రీమియం ప్రాసెసింగ్) ను పునరుద్ధరించింది.  తాజా నిర్ణయంతో సుమారు 65వేలమంది భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది.  

2018 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను  పునరుద‍్ధరించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్‌ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాసెసింగ్‌  ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని హామీ ఇచ్చింది. అలాగే గరిష్ట పరిమితిని 65,000గా నిర్ణయించింది.

కాగా  ఈ ఏడాది ఏప్రిల్‌ 3నుంచి  ప్రీమియం హెచ్ 1-బీ వీసా ప్రాసెసింగ్‌ ను ఆరు నెలల పాటు రద్దు చేసింది. భారీ డిమాండ్‌,  రెగ్యులర్‌ వీసా ప్రాసెసింగ్‌ లో జాప్యం తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా  ప్రకటించిన సంగతి తెలిసిందే.