డబ్లిన్ నగరంలో తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్ బతుకమ్మ సంబరాలు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

డబ్లిన్ నగరంలో తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్ బతుకమ్మ సంబరాలు

24-09-2017

డబ్లిన్ నగరంలో తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్ బతుకమ్మ సంబరాలు

ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్ ) గత 5 సంవత్సరాలుగా  బతుకమ్మ సంబరాలు డబ్లిన్ నగరంలో  నిర్వహిస్తున్నారు. తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్ స్థాపించి 5 సంవత్సరాలు అయినా సందర్భముగా ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. సుమారు 40  మంది వాలంటీర్స్ ఈ పండుగ విజయవంతం కావటానికి ఎంతగానో కృషి చేశారు.

ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా  సుమారు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు రంగు రంగుల పూలతో చక్కటి బతుకమ్మలను పేర్చి వేదికపై వలయాకారంలో అమర్చి ,   బతుకమ్మ, దాండియా  ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో ఈ  కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి .  మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో  తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్  వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు .   బతుకమ్మలను పేర్చిన ప్రతి తెలుగు ఆడపడుచులకు ప్రత్యేక బహుమతులను  అందించారు. పిల్లలకు మేజిక్ షో , పేస్ పెయింటింగ్ ఏర్పాటు చేసారు.  వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు. ఇండియన్ ఎంబసీ తరపున ఫస్ట్ సెక్రటరీ అనిత శుక్ల గారు మరియు ఐర్లాండ్ లోకల్ MP రూత్ కోపింగర్ గారు ఈ బతుకమ్మ పండుగకు హాజరై బతుకమ్మ ఆటను ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడారు. 

ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు :

జగన్  మేకల, ప్రబోధ్  మేకల, కమలాకర్  కోలన్, సాగర్, శ్రీనివాస్ కార్పె, రాజేష్ అది, రవీందర్ చప్పిడి, వెంకట్ అక్కపల్లె, వెంకట్ గాజుల,  బలరాం కొక్కుల, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ పటేల్, షరీష్ బెల్లంకొండ,  శ్రీకాంత్ సంగిరెడ్డి, శశిధర్ మర్రి, దయాకర్  కొమురెల్లి, అల్లంపల్లి శ్రీను, అల్లే  శ్రీను, సుమంత్  చావా, వెచ్చ శ్రీను, సిల్వెని  శ్రీను, ప్రవీణ్లాల్, ప్రదీప్ యల్క, వెంకట్ యానాల, త్రిషేర్ పెంజర్ల, నగేష్ పొల్లూరు, నవీన్ గడ్డం, వెంకట్  తిరుకోవలురు, సునీల్ పాక, శ్రీధర్  యమసాని, కొసనం శ్రీను, రామ గౌడ్. 

Click here for Event Gallery