న్యూయార్క్‌లో టాటా బతుకమ్మ వేడుకలు
MarinaSkies
Kizen

న్యూయార్క్‌లో టాటా బతుకమ్మ వేడుకలు

28-09-2017

న్యూయార్క్‌లో టాటా బతుకమ్మ వేడుకలు

న్యూయార్క్‌లో బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగింది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (టాటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది మహిళలు, పిల్లలు,  పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎటు చూసినా పండుగ కోలాహలం అందరి ముఖాలలో ఆనందం,  ఉత్సాహం, ఆడవారి చేతిలో బతుకమ్మలు, పట్టు చీరల గరగరలు, ఆభరణాల ధగదగలు, పిల్లలు పెద్దలు పట్టు లంగాలు, పంచాలు, శల్వారు, కమీజులు సంప్రదాయ దుస్తులు ధరించి 800 లకు పైగా తెలుగువాళ్ళు ఇందులో పాల్గొన్నారు. లాంగ్‌ ఐలాండ్‌ తెలుగు వారి రాడిస్నన్‌ హోటల్‌ లో తెలంగాణ అమెరికన్‌ తెలుగు సంఘం (టీఎటీఎ) వారు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఎ), న్యూయార్కు వారి సహకారంతో నిర్వహించిన ఈ బతుకమ్మ, దసరా పండగ విజయవంతమైంది.

టీఏటీఏ సలహాదారు మండలి చైర్మన్‌ శ్రీ పైళ్ళ మల్లారెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌ మున్నెన్నడూ లేనంతగా ఆహుతులతో కిక్కిరిసి పోయింది. దాదాపు నలభైకి  పైగా చిన్నా పెద్దా బతుకమ్మలు, వేదికనలంకరించగా, మహిళలంతా అమ్మవారికి భక్తిశ్రద్దలతో పూజలు పారాయణాలు చేశారు. సింగర్‌ అదితి తన పాటలతో అలరించగా, యాంకర్‌ లక్ష్మి తన సహాజ వాక్సటిమతో, హాస్య సంభాషణలతో అల్లరి చేస్తూ కార్యక్రమానికి మంచి ఊపు తెచ్చారు. రీజినల్‌ వైస్‌ ప్రేసిడెంట్‌ లు, రంజీత్‌ క్యాతం, సహోదర్‌ పెద్ది రెడ్డిల నాయకత్వంలో, పురుష మహిళా రీజినల్‌ కోర్డినేటర్లు, సభ్యులు అత్యంత శ్రమకోర్చి వారాలుగా ప్రణాళికలు రచించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

 పూజానంతరం నైవేద్యం, ఆ పై నిమజ్జనం లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలు, పిల్లలు నుండి పెద్దలదాక షాషన్‌ షో, టాటా బృందం లోని మహిళల నృత్యం, జడ్జిల ఫ్యాషన్‌ షో లు అందరినీ అలరించాయి. చిన్నారులతో చేయించిన దాండియా నృత్యం అందరి హృదయాలు చూరగొన్నది. అనంతరం వందలాదిగా అతిథులు ఆడా మగా దాండియా ఆటలో మునిగి తేలారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య దాత శ్రీ పైళ్ళ మల్లారెడ్డి కాగా, హాల్‌ ని సుధాకర్‌ విడియాల,  మాధవ రెడ్డి సమకూర్చారు.  సంఘం జాతీయ మహిళ కో చైర్‌ మాధవి సోలేటీ తో బాటు ఉష మన్నెం, రీజినల్‌ కోర్డినేటర్లు యోగి వనమా, పవన్‌ రవ్వ, మల్లిక్‌ అక్కినపల్లి, సత్య రెడ్డి గగ్గిన పల్లి, శ్రీనివాస్‌ గంధం లు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో చురుకైన పాత్ర వహించారు. మహిళల నాయకత్వం ఈ కార్యక్రమ లో కొట్టొచ్చిన మరో హైలైట్‌. నాగశ్రీ నల్ల, మౌనికా కుంట, రామ వనమా, శ్వేత తాడేపల్లి, రాగిణి, అనిత గగ్గినపల్లి, సుజాత తాడేపల్లి, డల్లాస్‌ నుంచి వచ్చిన సునీతలు ముందుండి కార్యక్రమాలు నిర్వహించారు. ఫణి భూషణ్‌ తాడేపల్లి  మరియు శరత్‌ వేముగంటి బిఒడి లు కార్యక్రమ నిర్వహణలో తోడు నిలిచారు. కార్వ నిర్వహకులను సలహాదారుల మండి చైర్మన్‌ శ్రీ మల్లా రెడ్డి, సుధాకర్‌ రెడ్డి మాధవ రెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి సహకారం అందించిన టీఎల్‌సీఏ అధ్యక్షులు శ్రీనివాస్‌ గూడూరుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎల్‌సీఎ కార్యవర్గ సభ్యులు, అశోక్‌ చింతకుంట, కార్యదర్శి డా||జ్యోతి జాస్తి జాయింట్‌ ట్రెజరార్‌, రామ వనమా, ఉమా పోలి రెడ్డి, సిరిష తునుగుంట్ల చురుగ్గా పాల్గొన్నారు. ధర్మారావు తాపీ వైస్‌ ప్రెసిడెంట్‌, బాబు కుదరవల్లి కోశాధికారి, ప్రసాద్‌ కోయి కార్యవర్గ సభ్యులు సహకారం అందించారు.

Click here for Event Gallery