డల్లాస్‌లో ఘనంగా దసరా-బతుకమ్మ సంబరాలు
MarinaSkies
Kizen

డల్లాస్‌లో ఘనంగా దసరా-బతుకమ్మ సంబరాలు

03-10-2017

డల్లాస్‌లో ఘనంగా దసరా-బతుకమ్మ సంబరాలు

డల్లాస్‌ నగరంలో తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలకు సుమారు 12 వేల  మంది హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సంప్రదాయ దస్తుల్లో మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ ఆడారు. డా.పెప్పర్‌ ఎరేనాడల్లాస్‌ లో నిర్వహించిన ఈ వేడకల్లో వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటాపాటలతో యువతి, యువకులు అలరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రిస్కో నగర మేయర్‌ జెఫ్‌ చెనెయ్‌ సెప్టెంబరు 30ను టీపీఏడీ బతుకమ్మ దినోత్సవంగా ప్రకటించారు.

అనంతరం బతుకమ్మ పాటలతో ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్‌ హీరోయిన్‌ రెజీనా కసెండ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సింగర్స్‌ దీపు సమీరా, సాయి శిల్ప, యామినీ భాస్కర్‌, అముల్యా, శ్రావణి, యాంకర్‌ లాస్యలు సందర్శకులను ఉర్రూతలూగించారు. టీపీఏడీ చైర్మన్‌ ఉపేందర్‌, అశోక్‌ కొండాల, మాధవి సుంకిరెడ్డి, కరణ్‌ పొరెడ్డి, అజయ్‌ రెడ్డి, రఘువీర్‌ బండారు, మహేందర్‌ కోమిరెడ్డి, రావు కల్వాలా, ఆజనకీ మండాది, రాజవర్ధన్‌ గాంధీ, మహేందర్‌ కామిరెడ్డి, అశోక్‌ కొండాల, మనోహర్‌ కాసంగీ, మాధవి సుంకిరెడ్డి, రామ్‌ అన్నాడి, ఇంద్రాని పంచారుపుల, పవన్‌ గంగాధర, ప్రవీణ్‌ బిల్లా, రాజేంధర్‌ తొడిగాల, రాజ్‌ గోవర్ధన్‌   గాంధీలు తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery