టాటా దసరా ఉత్సవాలు విజయవంతం

టాటా దసరా ఉత్సవాలు విజయవంతం

09-10-2017

టాటా దసరా ఉత్సవాలు విజయవంతం

గ్రేటర్ ఫిలడెల్ఫియా, పెన్సూలినియాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) నిర్వహించిన దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేశాయి. ఫిలడెల్ఫియా, పెన్సూలినియాలో జరిగిన వేడుకలకు వెయ్యి మందికి పైగా హాజరై సంబరాలు జరుపుకున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, మేరి లాండ్, డెలావేర్ వంటి ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ సంబరాలకు హాజరై విజయవంతం చేశారు. డాన్స్ షోలు, పాటలు, ఆటలు, తెలంగాణ జానపద నృత్యాలు, గీతాలతో సందడి చేశారు. బిక్షునాయక్ వారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. ఆహుతులను సంతోషపరిచారు. 

పెన్సూలినియా సెనేటర్ ఆండ్రూ దిన్నిమన్ ప్రత్యేక అతిథిగా వచ్చి ఈ సంబరాలను తిలకించడం విశేషం. టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనగా… అర్జున్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ వంగా ప్రణయ్ రెడ్డి గౌరవ అతిథిగా విచ్చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న టాటా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, సీనియర్ నేతలు, స్థానిక, జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ఉన్నారు.