బే ఏరియాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ
Ramakrishna

బే ఏరియాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ

10-10-2017

బే ఏరియాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ

బే ఏరియాలో టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో  బతుకమ్మను తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, ఆటలు ఆడారు. లేక్‌ ఎలిజిబెత్‌ పార్క్‌ సమీపంలో  నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 1200మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారందరికీ టీడీఎఫ్‌ సంస్థ సభ్యులు స్రవంతి, సింధు, పల్లవి, షీటల్‌, రష్మి, సుచిత్ర, దివ్య, వేద, దీప్తి, రూప, మణికొండ శ్రీనివాస్‌, సంతోష్‌ అడ్డగుల, హరి గక్కని, ప్రదీప్‌.. తదితరులు ధన్యవాదాలు తెలిపారు.