నేనే ప్రథమ మహిళను... కాదు నేనే
Sailaja Reddy Alluddu

నేనే ప్రథమ మహిళను... కాదు నేనే

10-10-2017

నేనే ప్రథమ మహిళను... కాదు నేనే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌, మూడవ భార్య మెలానియా ట్రంప్‌ మధ్య బహిరంగ మాటల యుద్ధం కొనసాగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్యని తానేనని, కాబట్టి అమెరికా మొదటి మహిళను కూడా తానే అవుతానని ఇవానా ట్రంప్‌ వ్యాఖ్యానించింది. ట్రంప్‌ పిల్లలకు తల్లిని కూడా తానేనని పేర్కొనడం ఈ వివాదానికి కారణమైంది. ఇవానా ట్రంప్‌ వ్యాఖ్యలను మెలానియా ట్రంప్‌ ఆఫీస్‌ ఖండించింది. ఇవానా అర్థం లేకుండా మాట్లాడుతోందని, అమెరికా మొదటి మహిళ మెలానియా అని బదులిచ్చింది. ఇవానా, మెలానియా మధ్య బహిరంగ మాటల యుద్ధం కొనసాగుతోంది. రైజింగ్‌ ట్రంప్‌ అనే పుస్తకాన్ని రాసిని ఇవానా ట్రంప్‌, పుస్తక  ప్రచారానికి సంబంధించి ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో అమెరికా మొదటి మహిళ విషయంలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది.

ఇదిలావుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మొత్తం ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఇవానా, రెండవ భార్య మార్ల మాపుల్స్‌గా మూడవ భార్య మెలానియా ట్రంప్‌. మూడవ భార్యైన మెలానియా ట్రంప్‌ అమెరికా ప్రథమ మహిళగా కొనసాగుతున్నారు.