టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పులు
Sailaja Reddy Alluddu

టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పులు

10-10-2017

టెక్సాస్ యూనివర్సిటీలో  కాల్పులు

టెక్సాస్‌ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పలు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి చనిపోయాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ వ్యాపారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో క్యాంపస్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్టు స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి అక్కడిక్కడే చనిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు పారిపోయాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో యూనివర్సిటీని మూసివేశారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దుండగుడి వివరాలు తెలియరాలేదు.