తానా హ్యూస్టన్ హార్వే మన ఊరి కోసం 5K రన్
Sailaja Reddy Alluddu

తానా హ్యూస్టన్ హార్వే మన ఊరి కోసం 5K రన్

10-10-2017

తానా హ్యూస్టన్ హార్వే మన ఊరి కోసం 5K రన్

హ్యూస్టన్ నగరంలో తానా- హ్యూస్టన్ సమగ్ర భాగమైంది. తమ అంతర్గత సమయాన్ని సమాజం కోసం వినియోగించే కుటుంబాలు కలసికట్టుగా నిర్మించుకున్న సంస్ఠ తాన-హ్యూస్టన్. వివిధ సాంస్క్రుతిక, కళా-సాహిత్య కార్యక్రమలు నిర్వహిస్తూనే, ఒక్కసారిగా ముంచుకువచ్చిన “హార్వే తుఫాను” వల్ల యేర్పడిన అత్యవసర పరిస్థితులలో తానా-హ్యూస్టన్ వెనువెంటనె స్పందించి బాధిత కుటుంబాలకి ఆరువేల ఐదువందల పైచిలుకు “పేకేజ్డ్ మీల్స్ ”, “క్యన్ ఫుడ్”, త్రాగునీరు మరియు నిత్యావసర వస్తువులు అందించారు.

తానా అద్యక్షులు సతిష వేమన మరియు, ట్రస్టీ Dr. ప్రసాద్ నల్లురి, డైరెక్టర్ Dr. నాగేంద్ర శ్రీనివాస్  కొడాలి ఆద్వర్యంలో వాలంటీర్లు, తమ అమూల్యమైన సమయన్ని వెచ్చించి, వరదల్లో దెబ్బతిన్న ఇళ్ళు బాగు చేయడం, ఫుర్నిచర్ మార్చడం, షీట్రాక్ మార్చడం వంటి పనులు చేపట్టారు. వీటితో పాటుగా వరదల్లొ నిస్సహాయ పరిస్థితిలో ఉన్న “హ్యూస్టన్ చిల్రెన్స్ చారిటీ” మరియు “కేటీ ఫుడ్ బేంక్” సంస్ఠలకి తమ వంతు సహాయంగ అహరం, త్రాగునీరు అందించారు హ్యూస్టన్ తానా బ్రుందం.

ఈ సహాయకచెర్యల్లో భాగంగా నిథుల సేకరణ కోసం తానా- ఫౌండేషన్ హ్యూస్టన్ నగరంలో మన ఊరితొసం 5K రన్ మరియు 2K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడు వందల పైచిలుకు తానా మరియూ హార్వే వోలెంటీర్స్ పాల్గొని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో తానా లీడర్షిప్ బ్రుందం హార్వే వోలెంటీర్స్ ని అభినందంచి, సత్కరించి వారి నిశ్వార్ద సేవలను కొనియాడారు.తానా- ఫౌండేష చైర్మన్ నిరంజన్ శృంగావరపు, ట్రస్టీ Dr. ప్రసాద్ నల్లురి, డైరెక్టర్ Dr. నాగేంద్ర శ్రీనివాస్  కొడాలి హార్వే హ్యూస్టన్ కార్యక్రమాల్ని విజయవంతం చేసిన రత్న ప్రసాద్ గుమ్మడి, చందు శిరిగిరి, పూర్ణ సుధాకర్ వేములపల్లి, సుదీర్ కోనేరు, ప్రసాద్ యార్లగడ్డ, సురేష్ తొట్టెంపూడి, సుంరేంద్ర నల్లురి, రాంబాబు కట్టా, శంకర్ క్రాంతి శారిక, రాజెష్ వెల్లంకి, సుమిత్ అరిగపూడి, కార్తీక్ రెడ్డి బొమ్మనా, క్రిష్ణారావు కొల్లూరి, మురళీ చిలుకపాటి,  నూతన్ పల్లా, శివరాం బెల్లం, మనొహర్ పల్లా, ప్రవీణ్ గుల్లపల్లి, గోపి రాచకొండ,  అరున్ సుధాకర్ వేములపల్లి, వెంకట శీలం, శ్రీహరి మాగంటి తదితరులని ప్రత్యేకంగా అభినందంచారు.

ఈ కార్యక్రమంలో తానా సినియర్స్ పద్మశ్రీ ముత్యాల, ప్రభాకర్ చౌదరి కాకరాల, మల్లికార్జున రావు చలసాని, ఆంజనేయులు కోనేరు, మురళి తాళ్లూరి మరియూ తానా మెంబర్స  పాల్గొన్నారు.