అమెరికాలో తెలుగుకి మూడో స్థానం
Sailaja Reddy Alluddu

అమెరికాలో తెలుగుకి మూడో స్థానం

11-10-2017

అమెరికాలో తెలుగుకి మూడో స్థానం

తెలుగు భాష కానీ ప్రాంతాలకుగానీ, వేరే ఇతర దేశాలకు వెళ్ళినపుడు మన భాషల్లో ఎవరైనా మాట్లాడితే ఎలా ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనే భరోసాతోపాటు సంతోషం కలుగుతుంది. ఇలాంటి ఫీలింగ్‌ ఇప్పుడు అమెరికాలో కూడా కలుగుతోంది. అమెరికాలోని ఏ నగర వీధుల్లో తిరిగినా తెలుగువారు ఎదురు పడతారు. బాగున్నారా అంటూ పలకరిస్తున్నారు. ఇది మన భాష మీద మక్కువతో ఊరకనే చెబుతున్నదికాదు. ఓ సర్వే లో తేలిన నిజం. 2016 సంవత్సరానికిగానూ అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే సెప్టెంబర్‌లో ఒక నివేదిక విడుదల చేసింది. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో నిలిచింది. హిందీ మొదటి స్థానంలో, గుజరాత్‌ రెండోస్థానంలో నిలిచాయి. బెంగాలీ, తమిళంను వెనక్కి పెట్టి తెలుగు మూడోస్థానాన్ని ఆక్రమించింది. అంటే బెంగాలీ, తమిళం మాట్లాడే వారి కన్నా తెలుగు మాట్లాడే వారే అమెరికాలో ఎక్కువ ఉన్నారు. యూఎస్‌లో ఐదేళ్ళ అంతకు మించి వయసున్న 3,67,566 మంది ఇళ్ళలో తెలుగు మాట్లాడుతున్నట్లు నివేదిక సృష్టం చేసింది. అమెరికా జనాభాలో ఇది 0.12 శాతం. నిజానికి 4,24,482 మందితో ఉర్దూ రెండోస్థానంలో నిలిచినప్పటికీ వీరిలో పాకిస్థానీలు కూడా ఉన్నారు. ఉర్దూ పక్కన బెట్టి మిగిలిన భారతీయ భాషలకు ర్యాంకింగ్స్‌ ఇచ్చారు.