కాలిఫోర్నియాలో కార్చిచ్చు
Sailaja Reddy Alluddu

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

11-10-2017

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియాలో వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చులు, ఇప్పటివరకూ 11కు పైగా ప్రాణాలను బలితీసుకున్నాయి. 2000కు మించి ఇళ్ళు, వ్యాపారాలను ఆహుతి చేశాయి. శక్తిమంతమైన గాలులు కూడా తోడవడంతో, ఈ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. వేలాది మంది ఇళ్లు, వ్యాపారాలను వదిలి పెట్టి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లున్నారు. ఆదివారం ఈ కార్చిచ్చులు మొదలయ్యాయని, గంటలకు 80 కి.మీ. వేగంతో గాలలు వీస్తుండటంతో జ్వాలలు విపరీతంగా పెరిగాయని అధికారులు తెలిపారు. లక్ష ఎకరాలను దహించివేశాయని పేర్కొన్నారు. నాపా, సొనోమా, యుబా కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్‌ జెర్రీ బ్రౌన్‌ ప్రకటించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మీదే అధికారులు ప్రాథమికంగా దృష్టి పెట్టారు.