టిఎల్‌సిఎ పోటీలకు భారీ స్పందన
Sailaja Reddy Alluddu

టిఎల్‌సిఎ పోటీలకు భారీ స్పందన

12-10-2017

టిఎల్‌సిఎ పోటీలకు భారీ స్పందన

న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక పోటీలకు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల నుంచి పెద్దలదాకా ఎంతోమంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కల్చరల్‌ కేటగిరిలో క్లాసికల్‌ మ్యూజిక్‌, లైట్‌ మ్యూజిక్‌, క్లాసికల్‌ భరతనాట్యం, కూచిపూడి, ఫిలిం, జానపద నృత్యాలు, సెమి క్లాసికల్‌ విభాగంలో పోటీలను నిర్వహించారు. సాహిత్య విభాగం కింద వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, వక్తృత్వ పోటీలను నిర్వహించినట్లు టిఎల్‌సిఎ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ గూడూరు తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌ డా. ధర్మారావు తాపి, సెక్రటరీ అశోక్‌ చింతకుంట, ట్రెజరర్‌ బాబు కుదరవల్లి, జాయింట్‌ సెక్రటరీ జయప్రకాష్‌ ఇంజపూరి, జాయింట్‌ ట్రెజరర్‌ డా. జ్యోతి జాస్తి తదితరులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చూశారు.