న్యూజెర్సిలో 5న దీపావళి వేడుకలు

న్యూజెర్సిలో 5న దీపావళి వేడుకలు

12-10-2017

న్యూజెర్సిలో 5న దీపావళి వేడుకలు

న్యూజెర్సిలో తెలుగు కళాసమితి (టిఫాస్‌) ఆధ్వర్యంలో నవంబర్‌ 5వ తేదీన దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. నార్త్‌ బ్రన్స్‌విక్‌ హైస్కూల్‌లో జరిగే ఈ వేడుకలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రారంభించినట్లు టిఫాస్‌ అధ్యక్షుడు గురుఆలంపల్లి తెలిపారు. హీరోయిన్‌ రెజీనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని, మరో హీరోయిన్‌ యామిని భాస్కర్‌ కూడా హాజరవుతున్నారని చెప్పారు. గాయనీగాయకులు దీపు, ఉమానేహా పాటల విభావరితోపాటు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆరాధ్యుల కోటేశ్వరరావుతో శ్రీకృష్ణరాయబారం ఏకపాత్రాభినయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేదిక్‌ టెక్నాలజీపై మాస్టర్‌ శ్రీవత్స ప్రసంగంతోపాటు ఫ్యాషన్‌ షో, గేమ్స్‌ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన కోరారు.

www.tfasnj.org