సైనిక సలహాదారులతో డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం
MarinaSkies
Kizen
APEDB

సైనిక సలహాదారులతో డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం

12-10-2017

సైనిక సలహాదారులతో డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం

కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైనిక సలహాదారులతో సమావేశమయ్యారు. ఉత్తర కొరియా ఎలాంటి అతిక్రమణలకూ దిగినా స్పందించేందుకున్న అవకాశాలు, అమెరికా మిత్రదేశాలపై కిమ్‌ ప్రభుత్వం అణుదాడి బెదిరింపులను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరింగింది. రక్షణమంత్రి జేమ్స్‌ మాటిస్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ జోసెఫ్‌ డన్ఫోర్డ్‌ కూడా ఈ బేటీలో పాల్గొన్నారు.