కొరియా కాన్సులేట్‌ జనరల్‌గా సురేష్‌ చుక్కపల్లి
Kizen
APEDB

కొరియా కాన్సులేట్‌ జనరల్‌గా సురేష్‌ చుక్కపల్లి

13-10-2017

కొరియా కాన్సులేట్‌ జనరల్‌గా సురేష్‌ చుక్కపల్లి

దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పేరు గడించిన సురేష్‌ చుక్కపల్లికి అరుదైన గౌరవం లభించింది. ఫీనిక్స్‌ ఇన్‌ఫ్రా చైర్మన్‌గా ఉన్న సురేష్‌ చుక్కపల్లిని తమ కాన్సులేట్‌ జనరల్‌గా నియమిస్తూ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా కాన్సులేట్‌గా చుక్కపల్లి సురేష్‌ నియామకానికి భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే తన ఆమోదాన్ని తెలియజేసింది.

సురేష్‌ చుక్కపల్లి వ్యాపారరంగంలోనే కాక ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు. శబరిమలలోని అయ్యప్పదేవాలయం ధ్వజస్తంభానికి బంగారం తాపడం చేసే అవకాశం కూడా చుక్కపల్లి సురేష్‌కు లభించింది. ఆరోగ్య రంగంలో కూడా ఫీనిక్స్‌ గ్రూపు సేవలను అందిస్తోంది. అమెరికాలో పలు అసోసియేషన్లు నిర్వహించే కార్యక్రమాల్లో స్పాన్సర్‌గా ఉంటూ ఎన్నారైలను కూడా ఫీనిక్స్‌ గ్రూపు ఆకట్టుకుంటోంది. ఈ సంస్థకు చైర్మన్‌గా ఉన్న సురేష్‌ చుక్కపల్లి చేస్తున్న సేవాకార్యక్రమాలు, వ్యాపారదక్షత వంటివి ఆయనకు ఎన్నో పదవులను వరించేలా చేస్తున్నాయి. ఫీనిక్స్‌ గ్రూపుకు సంబంధించి గృహనిర్మాణ ప్రాజెక్టుల వివరాలను 'తెలుగు టైమ్స్‌' ప్రత్యేక శీర్షిక ద్వారా అందించిన సంగతి తెలిసిందే. కాన్సులేట్‌ జనరల్‌గా సురేష్‌ చుక్కపల్లి నియామకం పట్ల తెలుగు టైమ్స్‌ హర్షం వ్యక్తం చేస్తోంది.