నాసాకు తెలంగాణ విద్యార్థులు
MarinaSkies
Kizen
APEDB

నాసాకు తెలంగాణ విద్యార్థులు

13-10-2017

నాసాకు తెలంగాణ విద్యార్థులు

ప్రతిష్ఠాత్మక నాసా మానవాన్వేషణ రోవర్‌ ఛాలేంజికి తెలంగాణలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అమెరికాలో 2018లో ఏప్రిల్‌లో జరిగే 5వ వార్షిక నాసా హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరషన్‌ రోవర్‌ ఛాలేంజిలో వరంగల్‌కు చెందిన ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజి విద్యార్థుల బృందం పాల్గొనబోతోంది. మూన్‌ బగ్గీ డిజైన్‌ రూపొందించే ఎంపిక ప్రమాణంలో నెగ్గడంతో ఈ విద్యార్థులు ఫైనల్‌ ఛాలేంజికి ఎంపికయ్యారు. ఈ పోటీలో 23 దేశాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. ఈ విద్యార్థుల బృందానికి వారి అధ్యాపకులు నేతృత్వం వహించనున్నారు. ఆ ఛాలేంజిలో నెగ్గేందుక ప్రయత్నిస్తామని, తమకు ఈ పోటీలో ఎప్పుడెప్పుడు పాల్గొనాలా అన్న ఉద్విగ్నత ఉందని ఆ విద్యార్థి బృందం తెలిపింది.