ట్రావెల్‌ బ్యాన్‌ లో ట్రంప్‌కు ఊరట
Sailaja Reddy Alluddu

ట్రావెల్‌ బ్యాన్‌ లో ట్రంప్‌కు ఊరట

13-10-2017

ట్రావెల్‌ బ్యాన్‌ లో ట్రంప్‌కు ఊరట

ట్రావెల్‌ బ్యాన్‌ అంశంలో ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరటనిచ్చే తీర్పు. ఆరు ముస్లిం దేశాల పౌరులను అమెరికా రావడాన్ని నిషేధించడంపై వేర్వేరు రాష్ట్రాలతో తలెత్తిన వివాదంతో డొనాల్డ్‌ ట్రంప్‌ న్యాయపరంగా విజయం సాధించారు. మార్చి 6న ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆరు ముస్లిం దేశాల పౌరుల రాకపై ట్రంప్‌ 90రోజుల నిషేధం విధించగా, మేరీల్యాండ్‌, హవాయి, ప్రభుత్వాలు వ్యతిరేకించి న్యాయపోరాటానికి దిగాయి. ఫలితంగా రిచ్మండ్‌, వర్జీనియా, కాలిఫోర్నియాలోని అప్పీళ్ళు కోర్టులు ట్రంప్‌ ఆదేశాలు అమలుపై స్టే విధించాయి. స్టేను వ్యతిరేకిస్తూ శ్వేతసౌధం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. 90 రోజుల నిషేధం ముగిసిన తర్వాత ఈ తీర్పు వచ్చినా వలస విధానం కఠినతరం చేసే అంశంలో ట్రంప్‌కు మరింత మద్దతు లభించినట్లయింది.