యునెస్కో నుండి వైదొలగిన అమెరికా
Sailaja Reddy Alluddu

యునెస్కో నుండి వైదొలగిన అమెరికా

13-10-2017

యునెస్కో నుండి వైదొలగిన అమెరికా

ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) నుంచి అమెరికా నిష్క్రమించింది. యునెస్కో  నుంచి వైదొలిగినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారికంగా ప్రకటించింది. 2018 డిసెంబరు 31 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సృష్టం చేసిది. అయితే శాశ్వత పరిశీలకుడి హోదాలో కొనసాగుతామని తెలిపింది. ఆ సంస్థ అనుసరిస్తున్న  ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాన్ని  ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికార ప్రతినిధి హెదర్‌ నవర్ట్‌ వెల్లడించారు. ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని, యూనెస్కోలో పేరుకుపోయిన బకాయిలపై అమెరికా ఆందోళనలకు ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోందని అన్నారు. యూనెస్కో సమూల సంస్కరణల జరగాలని ఆమె అన్నారు.