బోస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో అరుణ్‌ జైట్లీ పర్యటన
Sailaja Reddy Alluddu

బోస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో అరుణ్‌ జైట్లీ పర్యటన

13-10-2017

బోస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో అరుణ్‌  జైట్లీ పర్యటన

అమెరికా పెట్టుబడిదారులకు భారత్‌పై పాజిటివ్‌ ఆలోచన ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల పట్ల అమెరికన్లకు మంచి భావనే ఉందని, భవిష్యత్తు కూడా బాగుంటుందన్న అభిప్రాయంతో అమెరికా ఇన్వెస్టర్ల ఉన్నట్లు తెలిపారు. బోస్టన్‌, న్యూయార్‌ నగరాల్లో జైట్లీ పర్యటించారు. ఆ టూర్‌లో పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ లీడర్లతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఐఎంఎఫ్‌ ఆఫీసులో భారతీయ వాణిజ్య సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అంశాలను వెల్లడించారు. అమెరికా ఇన్వెస్టర్లతో గత రెండ రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, అయితే వారికి భారత్‌ పట్ల పాజిటివ్‌ దృక్పథం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వం కూడా భారత్‌పై ఆశాజనకంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ ముచిన్‌, కామర్స్‌ సెక్రటరీ లిల్‌బర్‌ రాస్‌తో జైట్లీ సమావేశం అయ్యారు. ఇ్దదరు కూడా భారత్‌తో వాణిజ్యానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తున్నది.