ఇలాగైతే లైసెన్సులు రద్దే
Sailaja Reddy Alluddu

ఇలాగైతే లైసెన్సులు రద్దే

13-10-2017

ఇలాగైతే లైసెన్సులు రద్దే

అమెరికాకు చెందిన ప్రముఖ వార్త సంస్థలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు. తాను తీసుకొచ్చిన అణు విధానంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఎన్‌బీసీ న్యూస్‌పై ధ్యజమెత్తారు. సదరు న్యూస్‌ నెట్‌వర్క్‌ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అణు సామర్థ్యాన్ని పది రెట్టు పెంచాలని కోరుకుంటున్నానని ట్రంప్‌ అన్నారని ఎన్‌బీసీ కథనాన్ని ప్రసారం చేసింది. జాతీయ భద్రతా ఉన్నతాధికారులతో గత  వేసవిలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ట్రంప్‌ వ్యాఖ్యానించారని కథనంలో పేర్కొంది.