భారత్‌తో కాదు పాక్‌తోనే : అమెరికా
Sailaja Reddy Alluddu

భారత్‌తో కాదు పాక్‌తోనే : అమెరికా

13-10-2017

భారత్‌తో కాదు పాక్‌తోనే  : అమెరికా

చైనా పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సిపిఇసి)కి భారతదేశంతో ఎలాంటి ముప్పు ఉండదని, పాకిస్తాన్‌లోని అవినీతిపరులతో ముప్పు వాటిల్లుతుందని అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ ఒకరు పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని లియు పోస్ట్‌లో ఎకనమిక్స్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ పానోస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పాకిస్తాన్‌ల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇసుక గూడు లా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో విదేశీ పెట్టుబడుదారులు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్‌ పట్ల అమెరికా తన విధానాలను మార్చుకోవడం ఫలితంగా ఆ దేశంలోని మార్కెట్లు అగమ్యగోచరంలో పడిపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.