టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తో ఫ్లోరిడా వాసుల మాట మంతి

టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తో ఫ్లోరిడా వాసుల మాట మంతి

16-10-2017

టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తో ఫ్లోరిడా వాసుల మాట మంతి

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారితో ప్రవాస ఫ్లోరిడా భారతీయుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో అట్టహాసంగా జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రవాసులందరిని ఏకం చేసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను జాగృతి చేసే దిశలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఎంతో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా టాటా అధ్యక్షురాలు అమెరికాలోని నలుమూలల తెలంగాణ ప్రవాసులను కలుస్తున్నారు. ఫ్లోరిడా లోని తలహస్సీ ప్రాంతంలో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ఫ్లోరిడా ప్రాంతీయ సహా అధ్యక్షుడు హరి వేమిరెడ్డి ఆధ్వర్యం లో పర్సిస్ ఇండియన్ రెస్టారంట్ లో సుమారు వంద మందికి పైగా హాజరై ఝాన్సీ రెడ్డి గారితో ముచ్చటించారు. 
ఈ కార్యక్రమంలో టాటా చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ఆహుతులు అడిగి తెలుసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా దేశంలోనే తొలిసారిగా టాటా 18 రాష్ట్రాలలో బతుకమ్మ మరియు దసరా సంబరాలు నిర్వహించిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫ్లోరిడా వాసులు బీమ్రెడ్డి, శ్రీనివాస్, రామారావు, సతీష్ మరియు కృష్ణ లు టాటా సేవ డేస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సమాధానమిస్తూ డిసెంబర్ 13 నుండి 23 వరకు తెలంగాణ లోని అన్ని మండలాలలో కంటి, దంత మరియు ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తామని కావాల్సిన శస్త్ర చికిత్సలు పేదలకి అందేలా చూస్తామని తెలిపారు. రాఘవ్, లలిత, మధు, అర్జున్ మరియు సురేష్ లు అడిగిన విద్య మరియు రైతుల సమస్యల ప్రశ్నలకి సమాధానమిస్తూ, నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామని రైతులకు శిక్షణ శిబిరాలు మరియు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసారు. 

తలహస్సి లోని పర్సిస్ ఇండియన్ రెస్టారంట్ లో అత్యంత ఆహ్లాదంగా సరదాగా జరిగిన ఈ కార్యక్రమం లో ఆహూతులకు చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు. విచ్చేసిన ప్రతి ఒక్కరు భోజనం ఎంతో రుచిగ ఉందని తెలియజేసారు.

Click here for Event Gallery