చికాగోలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

చికాగోలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

20-10-2017

చికాగోలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

9 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మొదటి రోజు చికాగో చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు చికాగో చేరుకుని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగేందుకు ప్రవాసాంధ్రులు పోటీ పడ్డారు. కాగా చికాగోలో వివిధ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు డెమోఇన్స్‌కు చేరుకున్నారు. అనంతరం ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీని సందర్శించారు. అదే విధంగా వర్చువల్‌ రియాలిటీ అప్లికేషన్‌ సెంటర్‌ను సందర్శించడంతో పాటు రీసెర్చ్‌ పార్కులో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. స్టేటస్‌ రిపోర్ట్‌ నాలెడ్జ్‌ కన్సార్టియమ్‌లో పాల్గొన్నారు. అనంతరం ఐయోవా గవర్నర్‌తో విందులో పాల్గొన్నారు. 

Click here for PhotoGallery