చంద్రబాబు చేతుల మీదుగా MyProgressCard.Com ఆవిష్కరణ
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

చంద్రబాబు చేతుల మీదుగా MyProgressCard.Com ఆవిష్కరణ

20-10-2017

చంద్రబాబు చేతుల మీదుగా  MyProgressCard.Com ఆవిష్కరణ

పోటీ పరీక్షలకు హాజరయ్యే భారతీయ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర పాఠ్యాంశాలను, శిక్షణా పరీక్షలను ఉచితంగా వినియోగించుకునేందుకు www.myprogresscard.com పేరిట ఓ సమీకృత వెబ్‌సైట్‌ను తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న హాల్‌మార్క్ గ్రూపు రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ను చికాగో పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా జయశేఖర్ జాతికి అంకితం చేశారు. ఈ వేదికలో ఇప్పటివరకు లక్షకు పైగా విద్యార్థులు ఉచితంగా లబ్ధి పొందుతున్నారని జయశేఖర్ తెలిపారు. పేద, నైపుణ్యవంత విద్యార్థులకు ఇది అత్యంత ఉపయుక్తమవుతుందని, ప్రవాసులు తమ మేధస్సును ఇటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తే పార్టీలు, ప్రభుత్వాలకు అతీతంగా ప్రజలు హర్షిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, తానా ప్రతినిధులు గారపాటి విద్యా, చనుమోలు వినోజ్, హేమా కానూరు, సామినేని రవి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Click here for PhotoGallery