అమరావతిలో తానా భవన్‌

అమరావతిలో తానా భవన్‌

20-10-2017

అమరావతిలో తానా భవన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలో 2 మిలియన్‌ డాలర్లతో తానా భవనాన్ని నిర్మించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును షికాగోలో తానా ప్రతినిధులు కలిశారు. అమెరికాలోని 20 నగరాల్లో 5కె రన్‌ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తానా భవన్‌ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని వారు కోరగా,  ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.