ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు

ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు

20-10-2017

ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు

అమెరికా పర్యటనలో భాగంగా వివిధ సంస్థలకు చెందిన చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు. తొలుత ఐయోవా రాష్ట్రంలోని ప్రముఖ అమెరికన్ రాజకీయవేత్త, ప్రస్తుత ఐయోవా కార్యదర్శి విలియం హోవార్డ్ బిల్ నార్తేతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి సమావేశం. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్ ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఫామ్ ప్రొడక్షన్ అండ్ కన్జర్వేషన్ అండర్ సెక్రటరీగా ఇటీవలే ఎంపికైన బిల్ నార్తే. సెనేట్ కమిటీ ఎంపికను ప్రస్తావిస్తూ నార్తేను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తరువాత వేగనింగన్ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎల్. ఓ. ఫ్రిస్కోతో ముఖ్యమంత్రి సమావేశం. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో ఆరోగ్యవంతమైన పోషకాహారం, మంచి జీవన ప్రమణాలు గల వాతావరణం కోసం కృషి సాగిస్తున్న వేగనింగన్ విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ అంశాలపై కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉందో పరిశీలించడానికి తమ బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తానని ముఖ్యమంత్రికి తెలిపిన ప్రొఫెసర్ ఫ్రిస్కో. వ్యవసాయ రంగంలో వైజ్ఞానిక అవసరాల కోసం ఉభయులం కలిసి ఒక ‘గ్లోబల్ కన్సార్టియం’ ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన.

ఐయోవా విశ్వవిద్యాలయం, వేగనింగన్ విశ్వవిద్యాలయం ఉమ్మడిగా ముందుకొచ్చి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఒక కన్సార్టియంగా ఆవిర్భవిస్తే అందరికీ లాభదాయకమని సూచన. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వేగనింగన్ అధ్యక్షురాలి అంగీకారం. ఏఏ అంశాలలో కలిసి పనిచేయాలో గుర్తించి దానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమని వెల్లడి.

ఎంవోయూపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలికి సమన్వయ బాధ్యతలు.

తరువాత ఐయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ, జీవశాస్త్రాల కళాశాల ఆచార్యుడు వెండీ వింటర్సన్‌తో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం. పలు అంశాలపై చర్చ.