డొనాల్డ్‌ ట్రంప్‌ పై మాజీల ఫైర్‌

డొనాల్డ్‌ ట్రంప్‌ పై మాజీల ఫైర్‌

20-10-2017

డొనాల్డ్‌  ట్రంప్‌ పై మాజీల ఫైర్‌

అమెరికా మాజీ దేశాధ్యక్షులు సాధారణంగా ఆ దేశ రాజకీయాలపై నోరు విప్పరు. సైలెంట్‌గానే తమ జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ మొదటిసారిగా అమెరికా రాజకీయాలపై ఆ దేశ మాజీ అధ్యక్షులు తమ గళం వినిపించారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న తీరుపై మాజీ అధ్యక్షులు ఒరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌లు ఫైర్‌ అయ్యారు. ఒవెల్‌ ఆఫీస్‌ నుంచి సాగుతున్న పరిపాలనను ఈ ఇద్దరూ తప్పుపట్టారు. దేశంలో రాజకీయ పరిస్థితులు సరిగా లేవని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. విభజన, భయం అనే రాజకీయాలను తిరస్కరించాలని ఒరాక్‌ ఒబామా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలను బెదిరించడం, వాళ్లలో అపనమ్మకాన్ని క్రియేట్‌ చేయడం మానివేయాలని బుష్‌ అన్నారు. ఈ ఇద్దరూ పరోక్షంగా దేశాధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. ఇద్దరూ వేరువేరు వేదికల్లో మాట్లాడినా, కానీ వాళ్లెవ్వరూ తమ విమర్ళల్లో ట్రంప్‌ పేరును నేరుగా వాడలేదు.

న్యూజెర్సీలో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ ప్రచారంలో ఒబామా మాట్లాడారు. విభజన సృష్టిస్తున్న రాజకీయాలను, భయం కలిగిస్తున్న రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని అమెరికన్లు ప్రపంచానికి చాటాలని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒబామాకేర్‌ను రద్దు చేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పపట్టారు. న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో జార్జ్‌ బుష్‌ మాట్లాడుతూ మూఢ విశ్వాసాలు బలపడుతున్నాయని, మన రాజకీయాలు కుట్రలకు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి మద్దతు తగ్గినట్లు కనిపిస్తున్నదని అన్నారు. అయితే మాజీ అధ్యక్షులు చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ట్రంప్‌ స్పందించలేదు.