అమరావతికి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ‘నలంద’

అమరావతికి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ‘నలంద’

21-10-2017

అమరావతికి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ‘నలంద’

ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన అప్పుడే ఫలితాలనిస్తోంది. శుక్రవారం న్యూయార్కు లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్లిల్లించ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అమరావతిలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నలందా 2.0 సంస్థ సంసిద్ధత తెలియజేసింది. తొలి 25 ప్రపంచ ర్యాంకులలో ఒకటిగా నిలిచేలా అమరావతిలో వరల్డ్ క్లాస్ యూనివర్శిటీ ఏర్పాటుకు సుముఖంగా వున్నామని నలందా 2.0 వ్యవస్థాపక అధ్యక్షుడు షాయిల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.